దుబాయ్ లో చిలకమర్తి వారి 'శ్రీ దుర్ముఖి' నామ సంవత్సర పంచాంగ ఆవిష్కరణ
- March 24, 2016
ప్రముఖ జ్యోతిష్య బ్రహ్మ మరియు పంచాంగ కర్త శ్రీ. చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారి పంచాంగ ఆవిష్కరణ దుబాయ్ లో 'వేవ్' మరియు 'సంప్రదాయం' వారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగింది. చిలకమర్తి ప్రభాకర్ శర్మ గారు దుబాయ్ లో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్నారు. ప్రపంచం లోనే తొలి ఆంగ్ల పంచాంగ కర్తగా శర్మ గారు ఎన్నో రికార్డులను అందుకున్నారు. శర్మ గారిని 'వేవ్' మరియు 'సంప్రదాయం' వారు సన్మానించటం జరిగింది. పంచాంగాన్ని తెలుగు మరియు ఇంగ్లీష్ భాషలలో ఆవిష్కరించటం కార్యక్రామానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలుగు పంచాగాన్ని 'వేవ్' అధినేత శ్రీ.రమేష్ గారిచే ఆవిష్కరింపబడగా, ఇంగ్లీష్ పంచాగాన్ని 'మాగల్ఫ్.కామ్' అధినేత శ్రీ.శ్రీకాంత్ చే ఆవిష్కరింపబడింది. తెలుగు లో ఆయన పంచాంగం ఎంతో సరళంగా ఎవ్వరూ ఇవ్వని విధంగా సమగ్ర ముహూర్త విధానము (ఎవరైనా వారి వారి కార్యక్రమాలకు లేదా శుభకార్యాలకు ముహూర్తం వారే స్వయంగా పెట్టుకునే విధంగా) ఇవ్వడం గమనార్హం. శర్మ గారు తాము రాసినటువంటి పంచాంగాలు మరియు ఇతర పుస్తకములు అందుబాటులో ఉండాలని www.chilakamarthi.com లో పొందపరచడమే కాకుండా ఉచితముగా ఇంగ్లీష్ భాషలో డౌన్లోడ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. 'శ్రీ దుర్ముఖి' నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని దుబాయ్ లో 'తెలుగు తరంగిణి' ఆధ్వర్యంలో జరిగే ఉగాది సంబరాలలో శర్మ గారి పంచాంగ శ్రవణం జరగనుంది అని నిర్వాహకులు ఈ సందర్భంగా మాగల్ఫ్ కు తెలియజేసారు.
ఈ కార్యక్రమములో రమేష్ రెడ్డి(వేవ్),సుదర్శన్(సంప్రదాయం),శ్రీకాంత్(మాగల్ఫ్),ఉమా పద్మనాభన్(ప్రముఖ సంఘ సేవకురాలు), గీతా రమేష్(వేవ్),లతా సుదర్శన్(సంప్రదాయం),పూర్ణిమ శర్మ,రమేష్ రెడ్డి(ప్రజ్ఞ కార్యనిర్వాహకులు),విశాలి,వెంకట రావు,దామోదరం తదితరులు పాల్గొన్నారు.






తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









