ఘనంగా స్వరకల్పన సమారాధన
- December 19, 2021
సింగపూర్: విద్య సంగీతం అకాడమీ (సింగపూర్) మరియు ద్వారం లక్ష్మి అకాడమీ అఫ్ మ్యూజిక్ సర్వీసెస్ (తిరుపతి) వారి ఆధ్వర్యములో,శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ వారి సహకారముతో “స్వరకల్పన సమారాధన” కార్యక్రమ ప్రథమ వార్షికోత్సవ వేడుకలు యూట్యూబ్ ద్వారా ఘనంగా నిర్వహించబడినవి.డిసెంబర్ 19, 2021 నాడు జరిగిన ఈ సాంస్కృతిక కార్యక్రమములను, సంగీతగురువులకు అంకితం చేస్తూ వారు రచించిన స్వరపరిచిన సంగీతాన్ని ప్రసారం చేసామని నిర్వాహకులు తెలిపారు.ఎందరో గురువులు, కళాకారులు తెలుగు music enthusiasts తమవంతు కృషిచేస్తూ పాటలు క్రియేట్ చేస్తున్న వారందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి, మన తెలుగుపాట వైవిధ్యాన్ని నిలబెడుతూ, మరిన్ని కొత్త పాటలను వెలుగులోకి తీసుకురావటానికి చేస్తున్న ఒక చిన్ని ప్రయత్నం ఈ స్వరకల్పన సమారాధన.అన్నమయ్య కీర్తనలతో,వర్ణాలతో, చక్కటి తిల్లానాతో మరిన్ని శాస్త్రీయ కృతులతో అంతర్జాలంలో ఉన్న తెలుగువారందరినీ రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం అలరించింది.ఈ వేడుకలలో ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన గురువులు లహరి కొలచెల,డాక్టర్ ద్వారం లక్ష్మి, డాక్టర్ శేషులత విశ్వనాథ్,తాడేపల్లి సుబ్బలక్ష్మి ,మోదుమూడి సుధాకర్, ద్వారం V K G త్యాగరాజ్,డాక్టర్ యనమండ్ర శ్రీనివాసశర్మ, లక్ష్మీ సూర్య తేజ, విష్నుభట్ల రామచంద్రమూర్తిగారు,కమలాదీప్తి పాడిన కీర్తనలను ప్రత్యక్షప్రసారం చేశారు.ఈ రచనలన్నీ నొటేషన్స్ తో సహా ఒక ఈ-పుస్తకరూపంలో కూడా ప్రచురించడం జరిగింది.అంతేకాక గురువులపేరు మీద వారు ఎంపిక చేసిన 11 మంది కళాకారులకు పారితోషకం రూపంలో ఆర్థికసహాయాన్ని కూడా అందచేసామని నిర్వాహకులు కార్యక్రమంలో ప్రకటించటం ముదావహం.
సింగపూర్, భారత దేశములనుండే కాక అమెరికా, UK మరియు మలేషియా నుండి కూడా వీక్షకులు చూసి ఆనందించటం ఈ కార్యక్రమమునకు మంచి శోభను చేకూర్చినది.మన సంగీతం మీద, సాంస్కృతిక విలువల మీద ఆసక్తి పెంచడానికి చేస్తున్న ఈ వార్షిక కార్యక్రమానికి, విద్య సంగీతం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు కాపవరపు విద్యాధరి వ్యాఖ్యానాన్ని అందించి ప్రేక్షకులందరినీ అలరించారు.ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ విచ్చేసి చక్కటి సందేశమును ఇచ్చినారు.ఈ అంతర్జాల స్వరకల్పన సమారాధన చక్కగా కూర్పు చేయటంలో సహకరించిన RK వీడియోగ్రఫీ (రాధా కృష్ణ గణేష్ణ, కాత్యాయని)లకు నిర్వాహకుల తరపున హృదయ పూర్వక ధన్యవాదములు. ఈ కార్యక్రమాన్ని చూసిన వారికి, సహకరించిన వారికి హృదయ పూర్వక కృతజ్ఞతాభివందనములు.


తాజా వార్తలు
- సాధారణ పరిస్థితుల్లో ఓరల్ మెన్షనింగ్ లేదు: CJI సూర్యకాంత్
- సిమెంట్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్,కొడంగల్ పై సీఎం రేవంత్ వారలు
- సైబర్ నేరగాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి: సీపీ సజ్జనార్
- ధోఫర్, అల్-వుస్టా గవర్నరేట్ల పై వొల్కానిక్ యాష్..!!
- దుబాయ్ లో 8 రోజులపాటు న్యూఇయర్ వేడుకలు..!!
- బహ్రెయిన్‌లో సరికొత్త వాటర్ సిటీ డ్యాన్సింగ్ ఫౌంటెన్..!!
- FIFA ఇంటర్కాంటినెంటల్ కప్..టిక్కెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- కువైట్ లో 73,700 కంపెనీలు మూసివేత..!!
- సౌదీలో బెల్కిన్ వైర్లెస్ ఛార్జర్ల రీకాల్..!!
- ఫ్లైట్ ప్రయాణికులకి అలర్ట్!







