వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడి రికార్డ్..

- December 19, 2021 , by Maagulf
వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడి రికార్డ్..

స్పెయిన్‌: స్పెయిన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించాడు ఇండియన్ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌. మరో ఇండియన్‌ ప్లేయర్‌ లక్ష్యసేన్‌తో జరిగిన సెమీఫైనల్‌ మ్యాచులో గెలిచి..ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా రికార్డుల్లొకెక్కాడు. శనివారం లక్ష్యసేన్‌తో గంట 9 నిమిషాల పాటు హోరాహోరీగా జరిగిన మ్యాచులో 17-21, 21-14, 21-17 తేడాతో శ్రీకాంత్ విజయం సాధించాడు.

మ్యాచ్‌ ప్రారంభంలో దూకుడుగా ఆడిన లక్ష్యసేన్..తర్వాత వెనుకబడ్డాడు. ఈ గెలుపుతో ఫైనల్ చేరిన కిదాంబి..ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచులో సింగపూర్‌ ప్లేయర్‌ లోహ్‌ కిన్ యూతో తలపడనున్నాడు. సెమీ ఫైనల్‌లో ఓడినా అద్భుత పోరాటంతో ఆకట్టుకున్న లక్ష్యసేన్‌...కాంస్య పతకాన్ని గెలుచుకుని ప్రకాష్‌ పదుకొనే, సాయి ప్రణీత్‌ల సరసన చేరాడు. ప్రస్తుతం వరల్డ్ నంబర్‌ ఫొర్టిన్‌గా ఉన్న శ్రీకాంత్‌.. సరికొత్త అధ్యాయానికి మరో అడుగు దూరంలో ఉన్నాడు.

ఓవరాల్‌గా ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ చేరిన మూడో భారత ప్లేయర్‌ శ్రీకాంత్. ఇప్పటివరకూ సైనా నెహ్వాల్, పి.వి. సింధు ఈ ఘనత సాధించారు. సైనా నెహ్వాల్ 2015లో, సింధు 2017,2018, 2019లో వరుసగా ఫైనల్ చేరింది. సైనా నెహ్వాల్‌ రజత పతకం గెలుచుకోగా.. సింధు రెండు సార్లు రజతం, ఓ సారి స్వర్ణ పతకాన్ని ముద్దాడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com