బ్లాక్ స్టోన్‌ను కిస్ చేసేందుకు అనుమతి లేదు: హజ్ మినిస్ట్రీ
- December 20, 2021
సౌదీ అరేబియా: మక్కా - బ్లాక్ స్టోన్ (అల్-హజర్ అల్-అస్వాద్)ను కిస్ చేసేందుకు అనుమతి లేదని హజ్ మినిస్ట్రీ స్పష్టం చేసింది.దీని కోసం ఎలాంటి అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదని, ఇందు కోసం ఈట్మర్నా అప్లికేషన్లో ఎటువంటి సర్వీసును యాడ్ చేయలేదని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. బ్లాక్ స్టోన్ ని కిస్ చేసేందుకు అనుమతించే అంశం రెండు పవిత్ర మసీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ నిబంధనలకు లోబడి ఉంటుందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పవిత్ర కాబా లోపలికి ప్రవేశించడానికి కూడా అనుమతి ఉండదని ఈ సందర్భంగా మినిస్ట్రీ వర్గాలు స్పష్టం చేశాయి. బ్లాక్ స్టోన్ కు ముద్దు పెట్టడం,యెమెన్ కార్నర్ ను తాకడం (అల్-రుక్న్ అల్-యమానీ), హిజ్ర్ ఇస్మాయిల్ వద్ద ప్రార్థన చేయడం కోసం అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఈట్మార్నా, తవక్కల్నా అప్లికేషన్లలో స్లాట్ బుక్ చేసుకోవాలని ఇంతకుముందు మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్‌రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







