భారత్ కరోనా అప్డేట్

- December 20, 2021 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భారత్‌లో కరోనా మహమ్మారి ప్రభావం ఇంకా దేశంపై తగ్గడం లేదు.గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 6,563 కొత్త కరోనా కేసులు రాగా, 132 మంది మరణించారు. అయితే నిన్న ఒక్క రోజు 8,077 మంది కరోనా నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 82,267 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.ఇదిలా ఉంటే గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇటీవల దేశంలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

అయితే దేశంలోని పలు రాష్ట్రాలపై ఒమిక్రాన్‌ దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా డెల్టా వేరియంట్‌తో పాటు ఒమిక్రాన్‌ వేరియంట్‌ పై దృష్టి సారించాయి. డెల్లా వేరియంట్‌ కంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉన్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ఒమిక్రాన్‌ కేసులపై ప్రత్యేకంగా దృషి పెట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com