హమద్ ఎయిర్ పోర్ట్ ను సందర్శించిన GCC భద్రతా ప్రతినిధి బృందం
- December 21, 2021
ఖతార్: గల్ఫ్ కో అపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) దేశాల్లో ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ స్టాండర్స్ ను పరిశీలించేందుకు విమానాశ్రయ భద్రత అధికారుల ప్రతినిధుల బృందం జీసీసీ దేశాల్లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా ఖతార్ లోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (హెచ్‌ఐఎ)ని సందర్శించింది. సెక్యూరిటీ ఇన్ అండ్ అవుట్ చెకింగ్, పాస్ పోర్టు విభాగం, లగేజ్/బ్యాగేజ్ చెకింగ్ ప్రక్రియల్లో వినియోగించే లేటెస్ట్ టెక్నాలజీ, పరికరాలు, స్మార్ట్ సిస్టమ్స్ పనితీరు అధికారులు పరిశీలించారు. అలాగే సెక్యూరిటీ ట్రైనింగ్ విధానం, స్మార్ట్ పరికరాల వినియోగాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, సందేహాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్టులో మనుషుల ప్రమేయం లేకుండా ప్రయాణికుల ట్రావెల్ ప్రాసెస్ ను ఎలక్ట్రానిక్ గా పూర్తి చేసేందుకు ఏర్పాటు స్మార్ట్ విధానాలపై జీసీసీ ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- కెనడా కొత్త పౌరసత్వ చట్టం
- అమెరికాలో శంకర నేత్రాలయ ఫండ్రైజింగ్ సంగీత కార్యక్రమం
- IBSA సమావేశంలో ప్రధాని మోదీ కీలక సూచనలు
- ఫ్యూచర్ సిటీలో పర్యటించిన సీఎం రేవంత్
- అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పై కీలకమైన అప్ డేట్
- వాషింగ్టన్లో వెబ్ సమ్మిట్ ఖతార్ 2026 ప్రమోషన్..!!
- అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ తాత్కాలికంగా ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ అధ్యక్షుడికి అరుదైన గౌరవం..!!
- ట్రాన్స్పోర్ట్ అథారిటీ అదుపులో 1,349 మంది..!!
- పని ప్రదేశంలో మీ హక్కులు తెలుసా?







