అలనాటి జమునకు టి.గవర్నర్ చే సత్కారం

- December 21, 2021 , by Maagulf
అలనాటి జమునకు టి.గవర్నర్ చే సత్కారం

హైదరాబాద్:వంశీ ఆర్ట్స్ థియేటర్స్ మరియు శుభోదయం గ్రూపు వారి సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 22 వ తేదీన రవీంద్రభారతిలో సాయంత్రం 5 గంటలకు  కళాభారతి, ప్రజానటి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ జమునా రమణారావు గారికి, తెలంగాణ రాష్ట్ర గవర్నర్, గౌరవనీయులు డాక్టర్ తమిళ ఇసై సౌందర్ రాజన్ గారిచే  సత్కారము జరుగును.. వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా స్వర్ణ వంశీ మరియు శుభోదయం గ్రూపుల జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు.. అంతే కాకుండా డాక్టర్ సి.నారాయణరెడ్డి-ఆళ్ల స్వర్ణ కంకణంతో కూడా ఆమెను సత్కరిస్తారు..  ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప సభా పతి మండలి బుద్ధప్రసాద్ కొత్త కవితలు-1  కవితా సంకలనాన్ని ఆవిష్కరిస్తారు. 

అమెరికా గాన కోకిల శారదా ఆకునూరు సి నా రె పాటలతో సంగీత విభావరిని సమర్పిస్తారు.డాక్టర్ కె వి రమణ, ఐఏఎస్ (రిటైర్డ్) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సభాద్యక్షులుగా వ్యవహరించే ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాస రెడ్డి అమెరికా, ప్రముఖ చలన చిత్ర దర్శకులు ఎ.కొందండ రామిరెడ్డి,డాక్టర్ లక్ష్మి ప్రసాద్ కలపటపు, ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ శుభోదయం గ్రూప్ పాల్గొననున్నారని వంశీ వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు తెలియ చేశారు.

వంశీ సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్ వంశీ రామరాజు,ఆర్ ప్రసన్న లక్ష్మీ, శుభోదయం గ్రూప్,  శైలజా సుంకరపల్లి, వంశీ సంస్థల మేనేజింగ్ ట్రస్ట్ కలసి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ని, కార్యక్రమానికి ఆహ్వానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com