అమెరికా అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్ మా పౌరుడు కాదు-సౌదీ
- December 22, 2021
సౌదీ అరేబియా: అమెరికా ఇటీవల అరెస్ట్ చేసిన టెర్రరిస్ట్... మా సిటిజన్ కాదని అమెరికాలోని సౌదీ ఎంబసీ తెలిపింది. ఈ సందర్భంగా అమెరికా వాదనను తీవ్రంగా ఖండించింది. కేసు విషయంలో అమెరికా సెక్యూరిటీ ఏజెన్సీలకు అవసరమైన సహాయం చేస్తామని ప్రకటించింది. నిందితుడు 21 ఏళ్ల సౌదీ జాతీయుడని అమెరికన్ అధికారులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని సౌదీ ఎంబసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు సంబంధించి మరింత స్పష్టతనిస్తూ అమెరికాలోని సంబంధిత అధికారులకు వివరాలు పంపినట్లు ఎంబసీ అధికారులు స్పష్టం చేశారు.ఈ వివరాలను అమెరికాలోని సౌదీ ఎంబసీ ట్వీట్ చేసింది.గత వారం మెక్సికో నుంచి యూఎస్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తిని అరిజోనాలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతను సౌదీకి చెందిన 21 ఏళ్ల అనుమానిత టెర్రరిస్టు అమెరికా ప్రకటించింది.దీంతో సౌదీ ఎంబసీ స్పందిస్తూ అమెరికా ప్రకటనను తప్పుబట్టింది.
తాజా వార్తలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం
- ఇథియోపియా అగ్నిపర్వతం ఎఫెక్ట్...
- అయోధ్య రామ్ మందిర్: అంగరంగ వైభవంగా ధ్వజారోహణ..
- డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు







