ఢిల్లీ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టివేత..
- December 22, 2021
న్యూ ఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఉగాండాకు చెందిన ఓ మహిళ దుబాయ్ నుండి ఢిల్లీ చేరుకుంది.అయితే ఈ లేడీ కిలాడి ప్రొఫైల్ పై అనుమానం కలగడంతో కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కస్టమ్స్ అధికారులు తమదైన స్టైల్లో విచారణ చేయగా డ్రగ్స్ గుట్టు బయటపడింది. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల ప్రత్యేకంగా బాక్స్ లు ఏర్పాటు చేసి, అందులో 14 కోట్ల విలువ చేసే 2.2 కేజీల డ్రగ్స్ ను దాచింది.
అయితే స్కానింగ్ కు చిక్కకుండా డ్రగ్స్ ను ట్రాలీ బ్యాగ్ నాలుగు పక్కల దాచి కర్బన్ పేపర్ చుట్టింది. తనతో మోసుకొని వచ్చిన లగేజ్ బ్యాగ్ ను క్షుణ్ణంగా అధికారులు తనిఖీలు చేశారు. డ్రగ్స్ బయటపడడంతో డ్రగ్స్‌ను సీజ్ చేసి సదరు మహిళను అరెస్ట్ చేశారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







