తెలుగు రాష్ట్రాల్లో చలి పులి
- December 22, 2021
తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది..ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఒక, సాయంత్రం నుంచి చలి వణికిస్తోంది.. విశాఖ ఏజెన్సీలో రెండేళ్ల తర్వాత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. దీంతో విపరీతంగా చలితీవ్రత పెరిగిపోయింది.. పొగమంచుకు శీతల గాలులు తోడవ్వడంతో ఏజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి.. ఈ సీజన్‌లో లంబసింగిలో జీరో డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, ఇవాళ పాడేరు, అరకులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుఎ కాదా.మినుములూరులో 8 డిగ్రీలు నమోదైంది.
మరోవైపు తెలంగాణలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే చలితో వణికిపోతోంది.. కొమురం భీం జిల్లా గిన్నెధరిలో 4.6గా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 5.8, బేలలో 5.9, మంచిర్యాల జిల్లా జన్నారంలో 6.1, వాంకిడిలో 6.11, బజార్ హత్నూర్‌లో 6.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.. ఇక, మరో ఐదు రోజుల పాటు కనిష్ట, గరిష్ఠ ఉష్ణోగ్రతలు అత్యల్పస్థాయిలో నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







