జీవితం రద్దవడం కంటే కార్యక్రమాలు రద్దవడమే మంచిది:WHO
- December 22, 2021
జెనీవా: మానవ సమాజం కరోనా పూర్వపు స్థితికి చేరుకుంటోందనుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ముంచుకొచ్చిన ముప్పు ‘ఒమైక్రాన్’. ప్రస్తుతం ఐరోపా దేశాలు, అమెరికాలో ‘ఒమైక్రాన్’ ప్రబల కరోనా వేరియంట్‌గా రూపాంతరం చెందింది. ఇప్పటికే పలు ఐరోపా దేశాలు ఒమైక్రాన్ కట్టడి కోసం కఠిన ఆంక్షలకు తెరతీసాయి. అయితే.. క్రిస్మస్ సమీపిస్తుండటంతో పండగ మూడ్‌లోకి వెళ్లిపోయిన ప్రజలు.. కరోనా ఆంక్షల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ విహారయాత్రలు, ఇతర వేడుకలు రద్దైపోయినందుకు చింతిస్తున్నారు.
ఈ పరిణామాం పలు దేశాల్లో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా ఆంక్షల పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత చూసి బెదిరిపోతున్న ప్రభుత్వాలు ఆంక్షలను మరింత కట్టుదిట్టం చేసేందుకు జంకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ సోమవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రయాణాలు, ఇతర కార్యక్రమాలు రద్దైపోతున్నందుకు ప్రజలు చింతించాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. ‘‘జీవితం రద్దవడం కంటే..కార్యక్రమాలు రద్దైపోవడమే మంచిది’’ అని వ్యాఖ్యానించారు. సోమవారం జరిగిన ఓ పత్రికాసమావేశంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వేడుకలు చేసుకుని ఆ తరువాత చింతించడం కంటే కార్యక్రమాలను మరో రోజుకు వాయిదా వేసుకోవడమే మంచిదని ప్రజలకు సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







