షహీన్ తుఫాను బాధితులకు బీమా డబ్బులు
- December 22, 2021
ఒమన్: షహీన్ తుఫాను కారణంగా నష్టపోయిన వారికి బీమా కంపెనీలు 62 మిలియన్ల రియాలకు పైగా పరిహారం చెల్లించాయి. షహీన్ తుఫాను బాధితుల కోసం బీమా క్లెయిమ్‌లలో 62 మిలియన్లు చెల్లించినట్లు క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) తెలిపింది. మస్కట్, నార్త్ అండ్ సౌత్ బటినాలోని గవర్నరేట్లు తుఫాను కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మొత్తం 9,800 కంటే ఎక్కువ క్లెయిమ్‌లు అప్లయ్ చేశారు. వాహనాలు, ఆస్తి నష్టంతో సహా ప్రకృతి వైపరీత్యాల ప్రమాదాలను కవర్ చేసే పాలసీల కోసం బీమా కంపెనీలకు చాలా క్లెయిమ్‌లు వచ్చినట్లు డేటాను బట్టి తెలుస్తోంది. దాదాపు 51 మిలియన్ల విలువైన రియాల క్లెయిమ్‌లు ఇప్పటికీ సెటిల్‌మెంట్‌లో ఉండగా.. దాదాపు 10 మిలియన్ల రియాల చెల్లింపులు జరిగాయని CMA తెలిపింది. ముఖ్యంగా గృహాలు, భవనాలు, ఆస్తుల నష్టం కోసం చెల్లించిన పరిహారం 45 మిలియన్లు మించిపోగా.. ఆ తర్వాత మోటారు ఇన్సూరెన్స్ కోసం 8.9 మిలియన్ రియాలు, ఇంజినీరింగ్ బీమా కింద 7.5 మిలియన్ రియాల పరిహారం కింద చెల్లించినట్లు CMA తన నివేదికలో వెల్లడించింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- తెలంగాణకు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది..
- ఏపీలో మూడు కొత్త జిల్లాలు
- 5.17 మిలియన్లకు పెరిగిన కువైట్ జనాభా..!!
- హైలే గోబీ వోల్కానో విస్ఫోటనం.. సౌదీ అరేబియా సేఫేనా?
- ఫ్రెండ్లీ వాతావరణంలో నిర్మాణాత్మక సంస్కరణలు..!!
- డిసెంబర్లో పెట్రోల్ ధరలు తగ్గుతాయా?
- ఖతార్‌తో గోవా పర్యాటక సంబంధాలు..!!
- అరేబియా సముద్రం పై వొల్కానిక్ యాష్..ఒమన్ అలెర్ట్..!!
- WTITC గ్లోబల్ ట్రేడ్ & ఇన్వెస్ట్మెంట్ వింగ్ సెక్రటరీగా శ్రీకాంత్ బడిగ నియామకం







