ప్రభుత్వంపై మండిపడ్డ నాని..ఇకపై నన్ను అలా పిలవద్దంటూ..
- December 23, 2021
టాలీవుడ్ స్టార్ హీరో నాని ఇవాళ మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం పై ఓ రేంజ్ లో రెచ్చి పోయారు.
ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని.. 10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్ కంటే పక్కనే ఉన్న కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటుందని చురకలు అంటించారు.
ఇప్పుడు ఏదీ మాట్లాడినా వివాదం అవుతుందని.. టికెట్ ధరలు పెంచినా కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని తెలిపారు. అయితే ఏపీ ప్రభుత్వం పై వ్యాఖ్యలు చేసిన హీరో నాని.. ఓ సంచలన నిర్ణయం కూడా తీసుకున్నారు. తన పేరు ముందు నేచురల్ స్టార్ తీసేద్దామనుకుంటున్నానని ప్రకటించారు. ఇక తనను నేచురల్ స్టార్ అని ఎవరు పిలవద్దని పేర్కొన్నారు. ప్రేక్షకులకు సినిమా చూపించడమే తమ లక్ష్యమని, లెక్కలు తర్వాత చూసుకుందామని నాని వెల్లడించారు. ఇక నాని.. ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమరాన్నే రేపుతున్నాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!