ముంబైలో త్వరలోనే సరికొత్త రవాణా విధానం...
- December 25, 2021
ముంబై: ముంబైలో త్వరలోనే సరికొత్త రవాణా విధానం అందుబాటులోకి రానుంది. 2022 జనవరి నుంచి నగరంలో వాటర్ టాక్సీ సేవలు ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.దక్షిణ ముంబై తీరం నుంచి నుంచి నవీ ముంబయి మధ్య ఈ వాటర్ టాక్సీలు తిరగనున్నాయి.ఇప్పటికే మూడు సంస్థలు వాటర్ టాక్సీ సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తుందని సమాచారం.. కాగా త్వరలోనే మరో సంస్థ కూడా ఈ రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి నవీ ముంబై వరకు ఒక ప్రయాణికుడి నుంచి 1200 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు వసూలు చేయనున్నట్లు సమాచారం.జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ వరకు 750 రూపాయలు చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.ఇక ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి ఎలిఫెంటా వరకు, డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి రేవాస్, ధరంతర్, కరంజాదే వరకు… డొమెస్టిక్ క్రూయిజ్ టెర్మినల్ నుంచి బేలాపూర్, నేరుల్, అయిరోలి, వాషి, ఖందేరీ ఐలాండ్స్, జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ మార్గాల్లోనూ వాటర్ టాక్సీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో రూట్లో గరిష్ట ప్రయాణ సమయం 30 నిమిషాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







