పెట్రోల్ స్టేషన్లలో 'డు' కియోస్క్‌లు
- March 25, 2016
మై నెంబర్ మై ఐడెంటిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా టెలికాం కంపెనీలు వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకోసం పలు ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధానంగా మనీ ఎక్స్ఛేంజ్ ఔట్లెట్స్, కన్వీనియెంట్ స్టోర్స్ మరియు షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఈ సర్వీసుల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక్కడ వినియోగదారులు రి-రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వీలుంది. డు కంపెనీ వినియోగదారుల కోసం కియోస్క్‌లను ఇనోక్/ఎప్కో స్షేన్స్లో ఏర్పాటు చేసింది. వీటి నుంచి ఎమిరేట్స్ ఐడి లేదా పాస్‌పోర్ట్ విత్ వీసా పేజ్‌తో డు రి-రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని డు అధికారులు వెల్లడించారు. పలు ఔట్‌లెట్స్‌లో డు రి-రిజిస్ట్రేషన్ సౌకర్యాల్ని కల్పించామనీ, సిబ్బంది వైట్ మరియు బ్లూ యూనిఫామ్‌లో వుండి, వినియోగదారులకు అన్ని విధాలా సహకరిస్తారని డు వర్గాలు వెల్లడించాయి. కియోస్క్‌ల ద్వారా ప్రతిరోజూ 25 నుంచి 50 మంది వరకు రీ-రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారనీ, ఎక్కువమంది రిటైల్ ఔట్‌లెట్స్‌ని సంప్రదిస్తున్నారని వారు చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్‌కు రోజుకు రూ.4 వేల కోట్ల నష్టం
- సౌదీ ట్రాన్సిట్ వీసా ఫెసిలిటీ సస్పెండ్: ఇండియన్ ఎంబసీ
- ఉద్రిక్తతల తగ్గింపు, ఇంధన స్థిరత్వంపై అమీర్, ట్రంప్ చర్చలు..!!
- పిల్లల ఇ-స్కూటర్ దుర్వినియోగానికి తల్లిదండ్రులే బాధ్యులా?
- సౌదీ వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన భద్రతా మండలి సమావేశం..లిబియా పై కీలక నిర్ణయం..!!
- వరల్డ్ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ డే: శుక్రవారం ఉచిత బస్ రైడ్స్..!!
- ఏప్రిల్ 20 నుంచి అన్ని పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు ప్రారంభం
- ఇరాన్ గడపకు పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్..
- IPL 2026: లక్నో పై బెంగళూరు ఘన విజయం









