ఏపీఎన్ఆర్టిఎస్ కృషితో,స్వస్థలం చేరిన నెల్లూరు జిల్లా మహిళ
- December 25, 2021
దోహా: ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్ తెలిపిన వివరాల ప్రకారం, 2020 సంవత్సరంలో నెల్లూరు జిల్లాకి చెందిన షేక్ మస్తానీ ఇంటి పని కొరకు ఖతార్ కు వెళ్లింది.అయితే కొన్ని నెలల తర్వాత స్పాన్సర్ ఇబ్బందులు పెట్టడం మొదలుపెట్టే సరికి భరించలేక ఆరోగ్యం క్షీణించే పరిస్ధితి రావటం తో ఇండియా కు పంపమని 3 నెలల నుంచి అడుగుతుంటే వారిని ఇండియాకు పంపుతాను అని చెప్పి రూమ్ లో పెట్టి రెండు రోజులనుంచి తిండి పెట్టకుండా చాలా ఇబ్బంది పెడుతుంటే, మస్తానీ వాళ్ళ భర్త గౌస్ బాషా కు తెలపడం తో ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ ద్వారా ఏపీఎన్ఆర్టీఎస్ చైర్మన్ మేడపాటి వెంకట్ దృష్టికి తీసుకొని రాగా వెంటనే స్పందించి, ఏపీఎన్ఆర్టీఎస్,ఖతార్, కో ఆర్డినేటర్ మనీష్ కి చెప్పి త్వరగా మస్తానీ గారిని ఇండియా పంపే ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది.వెంటనే స్పందించిన మనీష్ స్పాన్సర్ వాళ్లని కలిసి పరిస్థితి వివరించి మస్తానీ ని ఇండియా కు పంపాలని విజ్ఞప్తి చేసి స్పాన్సర్ను ఒప్పించడం జరిగింది.
ఈ సందర్భముగా బాధితురాలు మస్తానీ మాట్లాడుతూ... నేను సమస్యలలో ఉన్నానని తెలిసిన వెంటనే నా సమస్యను తొందరగా పరిష్కరించి ఇండియా పంపేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ ఏపీఎన్ఆర్టీఎస్, చైర్మన్ మేడపాటి వెంకట్, CEO దినేష్ కుమార్, డైరెక్టర్ ఇలియాస్, ఖతార్ ఏపిఎన్ఆర్టీఎస్ కో-ఆర్డినేటర్ మరియు ఖతార్ తెలుగు కళా సమితి జాయింట్ జనరల్ సెక్రటరీ అయిన మనీష్ కి మరియు నేను ఇండియా వెళ్ళేందుకు అవసరమైన ఆర్ధిక సహాయం అందించి ఖతార్ తెలుగు కళా సమితి అధ్యక్షులు తాతాజీ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భముగా ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ డైరెక్టర్ ఇలియాస్ మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఏపిఎన్ఆర్టీఎస్ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి నేతృత్వంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తోందని, వివిధ దేశాలలో చైర్మన్, సీఈఓ ఆదేశాలతో ఏపీఎన్ఆర్టీఎస్, కో-ఆర్డినేటర్స్ ను నియమించామని, ప్రవాసాంధ్రుల సమస్యలు పరిష్కరించేందుకు మరియు కో ఆర్డినేటర్స్ నెట్ వర్క్ అనునిత్యం పనిచేస్తుందని తెలిపారు.ప్రవాసాంధ్రులకు ఎటువంటి సమస్యలు ఉన్న APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్స్ 8500027678, 08632340678 సంప్రదించవచ్చన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తరపున మరియు APNRTS అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తరపున సీఈఓ దినేష్ కుమార్ తరపున మనీష్ మరియు, తాతజి ను అభినందిస్తూ, కృతజ్ఞతలు తెలిపారు.
బాధితురాలు షేక్ మస్థాని 23 డిసెంబర్ 2021 న హైదరాబాద్ చేరుకోవడం జరిగిందని వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కో-ఆర్డినేటర్ షేక్ గౌస్ బాషా ఫోన్ ద్వారా తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!