సౌదీ అరేబియా వెళ్లేవారికి శుభవార్త..
- December 26, 2021
సౌదీ అరేబియా: మహమ్మారి కరోనా నేపథ్యంలో భారత్ ఇప్పటికే 30కి పైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుంది. తాజాగా ఈ జాబితాలో సౌదీ అరేబియా చేరింది. దీంతో ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ విమాన సర్వీసులకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సౌదీలోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా 2022 జనవరి 1 నుంచి రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ప్రారంభం అవుతాయని తన ట్వీట్లో పేర్కొంది. ఇక ఎయిర్ బబుల్ ఒప్పందం ప్రకారం రెండు దేశాల మధ్య పరిమిత సంఖ్యలో డైరెక్ట్ విమాన సర్వీసులు నడిపించుకునేందుకు వీలు ఉంటుంది. కొన్ని ప్రత్యేక నిబంధనల మధ్య ఇరు దేశాలకు చెందిన ఎంపిక చేసిన విమానయాన సంస్థలు విమాన సర్వీసులు నడిపించుకోవచ్చు.
కాగా, భారత్ ఇప్పటికే 34 దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ జాబితాలో ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బంగ్లాదేశ్, భూటాన్, కెనడా, ఇథియోపియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇరాక్, జపాన్, కెన్యా, కువైత్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, నెదర్లాండ్స్, నైజీరియా, ఒమన్, ఖతార్, రష్యా, రువాండా, సింగపూర్, సీషెల్స్, స్విట్జర్లాండ్, శ్రీలంక, టాంజానియా, యూఏఈ, యూకే, అమెరికా, ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్, సౌదీ అరేబియా ఉన్నాయి.
ఇక తాజాగా కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వణికిస్తున్న వేళ సౌదీ అరేబియాతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకోవడం ఇరు దేశాల ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగించే విషయం. ముఖ్యంగా ఉమ్రా యాత్రికులు, భారత ప్రవాసులకు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







