దుబాయ్‌లో శని, ఆదివారాల్లో పెయిడ్ పార్కింగ్
- December 27, 2021దుబాయ్: యూఏఈలో నాలుగున్నర రోజుల వర్క్ వీక్‌గా మారిన తర్వాత కూడా దుబాయ్‌లో పెయిడ్ పార్కింగ్ కొనసాగనుంది.ఈ వీకెండ్ శని, ఆదివారాల్లో పెయిడ్ పార్కింగ్ సర్వీస్ అమల్లో ఉండనుంది. అయితే ప్రభుత్వం నోటీస్ ఇచ్చే వరకు శుక్రవారాలు, ప్రభుత్వ సెలవు దినాలలో ఉచిత పార్కింగ్ సేవలు కొనసాగుతాయని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. మెట్రో, ట్రామ్, వెహికిల్ టెస్టింగ్ సెంటర్లు, కస్టమర్ సర్వీస్ సెంటర్లు, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేత కోసం RTA కొత్త పని వేళలను ప్రకటించింది. కొత్త సమయాలు జనవరి 3(సోమవారం), 2022 నుండి అమలులోకి వస్తాయి.
వాహన పరీక్ష కేంద్రాలు
సాంకేతిక కేంద్రాలు ఆదివారం నుండి గురువారం వరకు వారం పాటు తెరిచి ఉంటాయి. శుక్రవారం 4pm నుండి 9pm వరకు పని చేస్తాయి. శనివారం ప్రభుత్వ సెలవుదినం.
దుబాయ్ మెట్రో
రెడ్ , గ్రీన్ లైన్లు సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 5 నుండి 1.15 వరకు పని చేస్తాయి. శుక్రవారం, శనివారాల్లో మెట్రో లైన్లు ఉదయం 5 నుండి 2.15 వరకు పనిచేస్తాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి తెల్లవారుజామున 1.15 గంటల వరకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.
దుబాయ్ ట్రామ్
సోమవారం నుండి శనివారం వరకు సర్వీస్ వేళలు ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ఉంటాయి. ఆదివారం ఉదయం 9 నుండి 1 గంటల వరకు సేవలు అందిస్తాయి.
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేత
ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ను ఫిబ్రవరి 2, 2022 నుండి శనివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు మూసివేయనున్నారు.
కస్టమర్ సర్వీస్ సెంటర్లు
సోమవారం నుండి గురువారం వరకు ఉదయం 8 నుండి రాత్రి 7.30 వరకు తెరిచి ఉంటాయి. శుక్రవారం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు.. శని, ఆదివారాల్లో బంద్ ఉంటాయి.
తాజా వార్తలు
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్