ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త..
- December 27, 2021
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు సజ్జనార్ ఎంతో కృషి చేస్తున్నారు. ఇక రూ.10 నాణెం విషయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నాణెలు చెల్లడం లేదని పుకార్లు వ్యాపించడంతో కిరాణ దుకాణ వాల్లు, ఇతర వ్యాపారస్తులు పది రూపాయల నాణేలను తీసుకోవడం లేదు. అలాగే ఆర్టీసీ బస్సులలో తీసుకుంటారా..?లేదా అనే సందేహం వ్యక్తం అవుతోంది.
దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ కండక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రయాణికులు ఎలాంటి అనుమానం లేకుండా రూ.10 నాణేలను ఆర్టీసీ బస్సుల్లో వినియోగించుకోవచ్చని ప్రకటించారు. టికెట్ తీసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చే రూ.10 నాణేలు తీసుకోవాలని కండక్టర్లకు తెలియజేయాలని రాష్ట్రంలోని అన్ని డిపోల అధికారులను ఆదేశించారు. ఇక ఎండీ సజ్జనార్ నిర్ణయంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







