కొత్త స్కూల్ టర్మ్‌లో భాగంగా రిమోట్ లెర్నింగ్‌ని ఆమోదించిన అబుధాబి
- December 29, 2021
మస్కట్: అబుధాబి ఎమర్జెన్సీ, క్రైసిస్ అండ్ డిజాస్టర్స్ కమిటీ కొత్త స్కూల్ టర్మ్‌లో భాగంగా మొదటి రెండు వారాలకు రిమోట్ లెర్నింగ్ మోడ్‌లను ఆమోదించింది. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్‌తో సమన్వయంతో ఎమిరేట్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ రిమోట్ లెర్నింగ్‌ని అందించనున్నారు. ట్రైనింగ్ సెంటర్లు, కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. COVID-19 వ్యాప్తిని పరిమితం చేయడానికి, ఎమిరేట్‌లో ఇన్ఫెక్షన్ రేటును తగ్గించేందుకు ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలల్లోని తల్లిదండ్రులు, విద్యా పరిపాలనా సిబ్బంది బూస్టర్ డోస్ పొందాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం
- బహ్రెయిన్‌లో ఇరాన్ పౌరుడికి 10 ఏళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్ రిటైల్ రంగంపై భారీ ఆశలు..Q4పై ఆశావహ దృక్పథం..!!
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!







