కోవిడ్ ఎఫెక్ట్.. గల్ఫ్ గేమ్స్ వాయిదా

- December 29, 2021 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్.. గల్ఫ్ గేమ్స్ వాయిదా

కువైట్‌: కువైట్‌లో వచ్చే నెలలో జరగనున్న గల్ఫ్ గేమ్స్ 2022 మే నెలకు వాయిదా పడ్డాయి. ఈ మల్టీ-స్పోర్ట్ ఈవెంట్ వాస్తవానికి జనవరి 9 నుండి 19 వరకు జరగాల్సి ఉంది. కానీ ఇటీవల కరోనా తీవ్రత కారణంగా వీటిని మే 11 నుండి 21 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రపంచవ్యాప్తంగా COVID-19 మహమ్మారి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈవెంట్లో పాల్గొనే అథ్లెట్లు, అధికారుల ఆరోగ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్వహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com