దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లలో పీక్ ట్రావెల్ అలర్ట్...

- December 31, 2021 , by Maagulf
దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లలో పీక్ ట్రావెల్ అలర్ట్...

దుబాయ్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లలో పీక్ ట్రావెల్ అలర్ట్ కొనసాగుతుంది. దీంతో దుబాయ్ ఇంటర్నేషనల్ (డిఎక్స్‌బి)లోని టెర్మినల్స్‌లోకి టిక్కెట్ ఉన్న ప్రయాణీకులు మాత్రమే అనుమతి ఇస్తున్నారు. డిసెంబరు 29, 2021, జనవరి 8, 2022 మధ్య సుమారు 2 మిలియన్ల మంది ప్రయాణికులువయా దుబాయ్ వెళతారని అంచనా. ప్రస్తుతం రోజువారీ ఏవరేజ్ ట్రాఫిక్ 178,000 మంది ప్రయాణికులను మించిపోయింది. ప్రస్తుత సెలవు సీజన్‌లో జనవరి 2న 198,000 కంటే ఎక్కువ మంది ప్రయాణికులు ఉంటారని అంచనా వేస్తున్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లోని టెర్మినల్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షమ్సీ మాట్లాడుతూ.. కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో బంధువులకు, స్నేహితులకు ఎయిర్ పోర్ట్ కు రాకుండా ఇంట్లోనే వీడ్కోలు చెప్పమని సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణాన్ని సురక్షితంగా మార్చుతుందని ఆయన సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com