భారత్‌లో ఒమిక్రాన్ కేసుల వివరాలు...

- December 31, 2021 , by Maagulf
భారత్‌లో ఒమిక్రాన్ కేసుల వివరాలు...

న్యూ ఢిల్లీ: భారత్‌లో  ఒమిక్రాన్‌ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటి వరకు డెల్టా వేరియంట్‌తోనే సతమతమవుతున్న ప్రజలకు ఇప్పడు ఒమిక్రాన్ మరింత భయాన్ని రేపుతోంది. డెల్టా వేరియంట్‌ కంటే 6 రేట్లు వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన మాటలను తారుమారు చేస్తూ మరింత శరవేగంగా ఒమిక్రాన్ వ్యాపించడం ఆందోళన కలిగించే విషయం.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన తాజా గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో 450, ఢిల్లీలో 320, కేరళలో 109, గుజరాత్‌లో 97, రాజస్థాన్‌ 69, తెలంగాణలో 62, తమిళనాడులో 46, కర్ణాటకలో 34, ఆంధ్రప్రదేశ్‌లో 16 ఇలా దేశవ్యాప్తంగా కరోనా కేసులు మొత్తం 1,270కి చేరుకున్నాయి. అయితే నేడు న్యూఇయర్‌ వేడుకల సందర్భంగా కొన్ని రాష్ట్రాలు న్యూయర్‌ వేడుకలపై ఆంక్షలు విధించాయి. మరి కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ అమలులో ఉంది. ప్రతి ఒక్కరూ కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాల్సి ఆరోగ్య శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com