డిజిటల్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయనున్న అబుధాబి

- December 31, 2021 , by Maagulf
డిజిటల్ బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయనున్న అబుధాబి

అబుధాబి: కొత్తగా జన్మించిన చిన్నారులకు డిజిటల్ బర్త్ సర్టిఫికెట్లను జారీ చేయనుంది అబుధాబి. ఈ మేరకు అబుదాబీ డిపార్టుమెంట్ ఆఫ్ హెల్త్ ఓ ప్రకటన చేసింది. టిఎఎంఎం - అబుధాబి గవర్నమెంట్ సర్వీసెస్ ప్లాట్‌ఫాం ద్వారా ఈ సర్టిఫికెట్లు జారీ చేయడం జరుగుతుంది. 30 డిసెంబర్ నుంచి ఈ కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. హెల్త్ కేర్ ఫెసిలిటీ నుంచి తల్లిదండ్రులకు ఈ విషయమై సమాచారం వస్తుంది. వెంటనే, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బర్త్ సర్టిఫికెట్ కోసం. అవసరమై డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడం ద్వారా డిజిటల్ బర్త్ సర్టిఫికెట్ పొందే వీలుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com