దుబాయ్ లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మహేష్

- January 02, 2022 , by Maagulf
దుబాయ్ లో  నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్న మహేష్

దుబాయ్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు రికార్డులు సృష్టించడం, బద్దలు కొట్టడం కొత్తేమీ కాదు. ఈ హ్యాండ్సమ్ హీరో కొత్త ఏడాది కొత్త హిస్టరీ సృష్టించాడు. ట్విట్టర్‌లో రికార్డు సృష్టించి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించాడు మహేష్. న్యూఇయర్ ప్రారంభం సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు పరశురామ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ ‘సర్కారు వారి పాట’ కొత్త షెడ్యూల్ అక్కడే జరుగుతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉన్న మహేష్ ట్విట్టర్‌లో దుబాయ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు.అభిమానులందరికి న్యూఇయర్ విషెస్ తెలియజేస్తూ అందరూ దయతో, కృతజ్ఞతతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు. ఈ ట్వీట్ మైక్రోబ్లాగింగ్ సైట్‌లో సంచలనం సృష్టించింది.

మహేష్ ఒక్క ట్వీట్ కే లక్షకు పైగా లైక్‌ లు రావడం విశేషం. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే 1 లక్షకు పైగా లైక్‌లను పొందిన మహేష్ 31వ ట్వీట్ ఇది. సోషల్ మీడియాలో ఈ అరుదైన ఘనతను సాధించిన ఏకైక భారతీయ నటుడు. మహేష్ బాబు ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ షూటింగ్‌ లో బిజీగా ఉన్నాడు. ఇక ఆయన స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్‌లతో కూడా సినిమాలు చేయబోతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com