మహారాష్ట్రలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా..
- January 02, 2022
ముంబై: మహారాష్ట్రలోనే రికార్డ్ స్థాయిలో 11 వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశమంతా ఒక ఎత్తైతే.. మహారాష్ట్రలో మరో ఎత్తు అన్నట్లుగా పరిస్థితి ఉంది.మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో కొత్తగా 11,877 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 50 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.తాజాగా నమోదైన ఒమిక్రాన్ కేసులతో మహారాష్ట్రలో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 510కి చేరింది. మహారాష్ట్రలో కరోనా కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా.. 2,069 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 42,024 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.ఇక తాజాగా మహారాష్ట్రలో నమోదైన కేసుల్లో 8,036 పాజిటివ్ కేసులు ముంబైలోనే నమోదయ్యాయి.దాంతో ముంబై అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది.
ఇదిలాఉంటే.. కేరళలో ఇవాళ 45 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఈ రాష్ట్రంలో ఒమిక్రాన్ బారిన పడిన వారి సంఖ్య 152కి చేరింది.ఇక దేశ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరింది.ఇప్పటి వరకు దేశంలోని 23 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతంలో ఒమిక్రాన్ కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 560 మంది కోలుకున్నారని కూడా ప్రకటించింది.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









