గోల్డ్ అవార్డును గెలుచుకున్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం
- January 03, 2022
హైదరాబాద్: GMR ఆధ్వర్యంలోని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (GHIAL) "తెలంగాణ రాష్ట్ర ఇంధన పొదుపు పురస్కారాలు - 2021(TSECA)"లో ప్రతిష్టాత్మక గోల్డ్ అవార్డును గెలుచుకుంది. ఇంధన పరిరక్షణలో హైదరాబాద్ విమానాశ్రయం అవలంబించిన కార్యక్రమాలకు ఈ అవార్డును ప్రదానం చేశారు.
ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఒక కార్యక్రమంలో తెలంగాణ, పుదుచ్చేరి రాష్ట్రాల గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ పారిశ్రమ ప్రముఖుల మధ్య ఈ అవార్డును GHIAL సీనియర్ అధికారులకు అందజేసారు.
_1641211461.jpg)
తమ రోజువారీ కార్యకలాపాలలో ఇంధన పొదుపు రీత్యా ఉత్తమ పద్ధతులు మరియు సాంకేతిక పురోగతిని అవలంబించే సంస్థలను ఈ వార్షిక ఫోరం గుర్తిస్తుంది. న్యాయనిర్ణేతలు ఈ పోటీలో పాల్గొన్న సంస్థలకు సంబంధించిన పాల్గొన్న సంస్విధ కార్యకలాపాలను పరిశీలించిన అనంతరం అవార్డులను ప్రకటించారు.
ప్రదీప్ పణికర్, సీఈఓ, GHIAL, మాట్లాడుతూ, “ఇంధన, జల వనరులను సమర్థంగా వాడుకోవాలన్న మా నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనం. భవిష్యత్ తరాల కోసం హైదరాబాద్ విమానాశ్రయం క్రమంగా క్లీనర్ అండ్ గ్లీనర్ టెక్నాలజీ దిశగా వెళుతోంది. బాధ్యత కలిగిన కార్పొరేట్ సంస్థగా మేం ఇంధన పరిరక్షణ, పర్యావరణ సుస్థిరత దిశగా మా కృషిని కొనసాగిస్తాము.” అన్నారు.
గత కొన్నేళ్లుగా GHIAL ఇంధన సామర్థ్య చర్యల వల్ల చెప్పుకోదగిన ఇంధన ఆదా జరిగి, విమానాశ్రయంలో GHG (గ్రీన్ హౌస్ గ్యాస్) ఉద్గారాలను వేగంగా తగ్గించడానికి దారితీసింది. ఎయిర్‌పోర్ట్ కార్బన్ అక్రిడిటేషన్ (ACA) ప్రోగ్రామ్ కింద ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుండి లెవెల్ 3 + “న్యూట్రాలిటీ” అక్రిడిటేషన్‌ను కలిగి ఉన్న హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, కార్బన్ న్యూట్రల్ ఎయిర్‌పోర్ట్ కూడా కావడం గమనించదగ్గ విషయం.
ఇంధన సామర్థ్య విధానాల అమలులో GHIAL ఎప్పుడూ ముందుంటుంది. GHIAL అనుసరించే వివిధ ఇంధన సామర్థ్య విధానాలు ఇప్పటికే పలు పారిశ్రామిక వేదికలపై గుర్తించబడ్డాయి.
GHIAL 2019, 2020 మరియు 2021లో ప్రతిష్టాత్మక CII ‘‘నేషనల్ ఎనర్జీ లీడర్ అవార్డు’’ ను గెల్చుకుంది. అంతే కాకుండా 2017 నుంచి క్రమం తప్పకుండా CII-GBC ఎక్సలెంట్ ఎనర్జీ ఎఫీషియెంట్ ట్రోఫీని గెలుచుకుంటోంది. అంతే కాకుండా ‘నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు 2021’లో 89.26% తో ‘‘సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్’’ను గెలుచుకుంది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







