ఖతార్ ఫౌండేషన్ క్యాంపస్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ బస్సుని పరీక్షించిన మినిస్ట్రీ
- January 03, 2022
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్, యవసలాట్ మరియు ఖతార్ ఫౌండేషన్‌తో కలిసి అటానమస్ మినీ బస్‌ని ఖతార్ ఫౌండేషన్ క్యాంపస్‌లో పరీక్షించడం జరిగింది.సెల్ఫ్ డ్రైవింగ్ వాహనం టెస్టింగ్ ద్వారా మొబిలిటీ మరియు ట్రాన్స్‌పోర్ట్ సేవల్ని ఖతార్‌లో మరింత మెరుగ్గా అందించేందుకు వీలుకలగనుంది. జనవరి 2 నుంచి పది రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఖతార్ నేషనల్ లైబ్రరీ మెట్రో స్టేషన్, కారి్నజీ మెల్లన్ యూనివర్సిటీ, టెక్సాస్ ఎ మరియు ఎం యూనివర్సిటీ, ఖతార్ నేషనల్ లైబ్రరీ మరియు నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీ ప్రాంతాల్లో ఎంపిక చేసిన మార్గాల్లో ఈ బస్సు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గంటకు 25 కిలోమీటర్ల వేగంతో 3.2 కిలోమీటర్ల దూరాన్ని డ్రైవర్ లేకుండా, ప్రయాణీకులు లేకుండా వాహనం నడుస్తుంది. లిడార్లు, రాడార్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ వాహనాన్ని తయారు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!







