బాలకృష్ణ సినిమాలో విలన్‌గా కన్నడ హీరో
- January 03, 2022
హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సెన్సెషన్ క్రియేట్ చేసిన బాలయ్య.. ఇప్పుడు మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని చేస్తున్నారు. ఇటీవలే “క్రాక్” సినిమాతో టాలీవుడ్ కు అద్భుతమైన హిట్‌ని అందుకున్నాడు గోపిచంద్ మలినేని. వీరిద్ధరి కాంబోలో రాబోతున్న ఈచిత్రాన్ని టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందించనున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ఈ సినిమాను ప్రారంభించారు.
మాస్ హీరో, మాస్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ అందించబోతోంది. అంతే కాదు ఈ సినిమాలో ఓ పవర్ ఫుల్ విలన్ పాత్ర ఉంది. ఆ పాత్రను ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ చేయనున్నారు. గోపీచంద్ మలినేని తన విలన్‌లను చాలా పవర్‌ఫుల్‌గా చూపించడంలో స్పెషలిస్ట్ కాబట్టి తెలుగులో నటుడికి ఇది సరైన ప్రారంభం అని చెప్పచ్చు. దీంతో ఈ సినిమాలో బాలకృష్ణ, దునియా విజయ్‌ల మధ్య ఫైట్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణను మునుపెన్నడూ చూడని లుక్‌లో ప్రెజెంట్ చేయడానికి దర్శకుడు శక్తివంతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడు. అలాగే ఈ కథ రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించారు. గోపీచంద్ మలినేని అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా కథను రెడీ చేస్తుంటారు. అందుకే అతను బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందిస్తున్నాడు. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహించనున్నారు. ప్రఖ్యాత రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ టెక్నీషియన్ నవీన్ నూలి ఎడిటింగ్ మరియు ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్. రామ్-లక్ష్మణ్ ఫైట్స్ మాస్టర్స్ వర్క్ చేస్తున్న ఈ చిత్రానికి చందు రావిపాటి ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ నెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







