రూ.50 కోట్లు గెలుచుకున్న డ్రైవర్!
- January 04, 2022
అబుధాబి: అబుధాబిలో ఉండే భారత ప్రవాసుడికి అదృష్టం వరించింది.వివరాల్లోకి వెళ్తే... ఎమిరేట్స్‌లో డ్రైవర్‌కి అదృష్టం వరించడంతో అబుధాబి బిగ్ టికెట్ లాటరీలో ఏకంగా 25 మిలియన్ దిర్హమ్స్(రూ.50కోట్లు) గెలుచుకున్నాడు.కేరళ రాష్ట్రం మలప్పురంకు చెందిన హరిదాసన్ మూతత్తిల్ వసున్నికి ఈ జాక్‌పాట్ తగిలింది.సోమవారం తీసిన బిగ్ టికెట్ రాఫెల్ డ్రాలో ఆయన విజేతగా నిలిచారు.డిసెంబర్ 30వ తేదీన కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నం.232976 అతడికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన హరిదాసన్ ఆనందానికి అవధుల్లేవు.కలలో కూడా ఊహించని విధంగా ఇంత భారీ మొత్తం గెలుచుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.
“ఇది ఇప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఈ ఆనంద సమయంలో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. నోటమాట రావడం లేదంటే నమ్మండి. ఇది నేను అస్సలు ఊహించనిది. 2022 బాగా కలిసొచ్చింది. ఇంత పెద్ద జాక్‌పాట్ తగలడం మాటల్లో చెప్పలేని అనుభూతి." అని ప్రముఖ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ హరిదాసన్ అన్నారు. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాకు చెందిన హరిదాసన్ గత దశాబ్ద కాలంగా అబుధాబి,అల్ ఐన్ ప్రాంతాల్లో డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ముస్సాఫా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా ఉన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 30న మరో తొమ్మిది మంది స్నేహితులతో కలిసి 235 సిరీస్‌లో నం. 232976తో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశారు.అదే వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. సోమవారం తీసిన బిగ్‌టికెట్ రాఫెల్ లక్కీ డ్రాలో ఈ పది మంది మిత్రులు కలిసి కొన్న లాటరీ టికెట్ నం. 232976 మొదటి బహుమతి గెలుచుకుంది.దీంతో 25 మిలియన్ దిర్హమ్స్ ప్రైజ్‌మనీ వారి సొంతమైంది. హరిదాసన్ మిత్రుడు హమ్జా కుట్టీ మాట్లాడుతూ ఇది తమ 10 మంది జీవితాలను మార్చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.ఇక ఇదే బిగ్ టికెట్ డ్రాలో రెండో బహుమతి అయినా రెండు మిలియన్ దిర్హమ్స్ ను మరో భారతీయ ప్రవాసుడు గెలుచుకున్నారు.అశ్విన్ అరవింధకషన్ డిసెంబర్ 16న కొనుగోలు చేసిన టికెట్ నం.390843కు ఈ జాక్‌పాట్ తగిలింది.
తాజా వార్తలు
- 5 అప్‌కమింగ్ వాట్సాప్ ఫీచర్లు
- నేటి నుండి ఏపీ రాష్ట్ర స్ధాయి పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
- ప్రపంచ ఆర్థిక ఔట్ లుక్ జనవరి అప్ డేట్ రిలీజ్ చేసిన IMF
- ఖతార్ లో 100% పైగా పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
- ఒమన్‌లో చెక్-బౌన్స్ కేసులదే అగ్రస్థానం: 2022లో 13 హత్యలు
- యూఏఈ రెసిడెన్సీ వీసాలు: మీరు తెలుసుకోవలసిన 7 ముఖ్యమైన మార్పులు
- ముసందమ్లో భూకంపం
- ఫిబ్రవరి 2023 పెట్రోలు, డీజిల్ ధరలు
- ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విశాఖపట్నం ... బాంబు పేల్చిన సీఎం జగన్..!
- దుబాయ్ టూర్లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫోటో వైరల్!