గోల్ఫ్ టోర్నీలో రజత పతకం సాధించిన విద్యార్థినిని అభినందించిన సైబరాబాద్ సీపీ
- January 04, 2022
హైదరాబాద్: గోల్ఫ్ లో రజత పతకం సాధించిన గౌలి దొడ్డిలోని గురుకుల పాఠశాలకు చెందిన ఎం.అనూషను ఈరోజు మర్యాదపూర్వకంగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర కలిశారు.అనూష రజత పతకం సాధించడంపై సీపీ స్టీఫెన్ రవీంద్ర హర్షం వ్యక్తంచేశారు.గురుకులాల నుంచి పతాకం సాధించిన మొదటి క్రీడాకారిణిగా అనూష గుర్తింపు తెచ్చుకుందన్నారు.భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ డాక్టర్ రామ్ లక్ష్మణ్, ఫిజికల్ డైరెక్టర్ వై.సత్యనారాయణ గోల్ఫ్ ప్రొఫెషనల్ కోచ్ భాస్కర్ శామ్యూల్, నిరంతరం కృషి చేస్తూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారని సీపీ అభినందించారు.
గోల్ఫ్ ప్రొఫెషనల్ కోచ్ భాస్కర్ శామ్యూల్ మాట్లాడుతూ..విశాఖ పట్నంలో డిసెంబర్ 24, 25వ తేదీల్లో నిర్వహించిన ఐజీయూ సౌత్ జోన్ జూనియర్ గోల్ఫ్ ఛాంపియన్ షిప్ లో అనూష సి - కేటగిరీలో రెండు రౌండ్లలో ప్రతిభ చాటి 28 , 24 స్కోర్ సాధించి రజత పతకం గెలుపొందిందన్నారు.ఇదే ఏడాదిలో బెంగళూర్, మైసూర్, కోయంబత్తూర్ లో జరిగిన సౌత్ జోన్ టోర్నీలో పాల్గొందన్నారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల హైదరాబాద్ లోని గౌలిదొడ్డిలో ప్రత్యేక గోల్ఫ్ అకా డమీని ఏర్పాటు చేశారన్నారు.2019 నుంచి అనూష అకాడమీలో శిక్షణ తీసుకుంటుందన్నారు. అకాడమీ విద్యార్థులను ప్రతీ గురువారం వికారాబాద్ లోని ఊటీ గోల్ఫ్ అకాడమీ మైదానంలో ప్రాక్టీస్ చేయించేవారన్నారు.దీంతో అనతికాలంలోనే అనూష గోల్ఫ్ క్రీడలో పట్టు సాధించిందని తెలిపారు.హైదరాబాద్ లో జరిగిన సౌత్ జోన్ సెలక్షన్స్ లో అనూష ఎంపికై టోర్నీలో పాల్గొని పతకం సాధించడం సంతోషంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..