హైదరాబాద్‌ మిధానీలో ఉద్యోగాలు..

- January 04, 2022 , by Maagulf
హైదరాబాద్‌ మిధానీలో ఉద్యోగాలు..

హైదరాబాద్: హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధానీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మినీరత్న సంస్థ అయిన మిధానీలో మెనేజ్‌మెంట్ ట్రెయినీ, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

  • నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 61 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
  • వీటిలో మేనేజ్‌మెంట్ ట్రెయినీ (53), అసిస్టెంట్ మేనేజర్ (06) ఖాళీలు ఉన్నాయి.
  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలో భాగంగా మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్‌ ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేషన్‌/హెచ్‌ఆర్, సివిల్, సేఫ్టీ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 20 ఏళ్లు మించకూడదు.
  • అసిస్టెంట్ మేనేజర్‌‌లో భాగంగా మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్, కార్పొరేట్‌ కమ్యూనికేషన్, మెడికల్, ఐటీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.
  • మేనేజర్‌ పోస్టుల్లో భాగంగా ఆటోమేషన్, మెకానికల్‌ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి.
  •  పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణతతోపాటు అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 40 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

  • ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారిని రాతపరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికచేస్తారు.
  • అసిస్టెంట్‌ మేనేజర్, మేనేజర్‌ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీగా 15-01-2021ని నిర్ణయించారు.

పూర్తి వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యగలరు.

http://https://midhani-india.in/

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com