విప్లవ నటుడు కి కత్తిపోట్లు

- June 08, 2015 , by Maagulf
విప్లవ నటుడు కి కత్తిపోట్లు

విప్లవ నటుడు ఆర్. నారాయణ మూర్తి కత్తి పోట్లకు గురయ్యాడు ,ఈ సంఘటన జరిగి దాదాపు పది రోజులు కావస్తోంది కానీ ఈ విషయం మాత్రం బయటకు పొక్కలేదు . విప్లవ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వ్యక్తి ,శక్తి ఆర్.నారాయణ మూర్తి .30కి పైగా చిత్రాలను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు గాంచిన నటుడు నారాయణమూర్తి . కాగా నారాయణమూర్తి తో అల్లాని శ్రీధర్ ఓ చిత్రం నిర్మించడానికి ప్రయత్నాలు చేసాడు కాగా ఆ చిత్రానికి కెమెరా మెన్ గా ఓ వ్యక్తిని అనుకున్నారు కానీ అతను వద్దని మరొక పెద్ద కెమెరా మెన్ ని తీసుకోవాలని అనుకున్నారట ! అయితే నాకు వచ్చిన సినిమాని నాకు కాకుండా ఎలా చేస్తావంటూ కోపానికి వచ్చాడట సదరు కెమెరా మెన్ . ఈ విషయంలో గొడవ మరింత ముదిరి కెమెరా మెన్ కత్తి తీసుకొని ఆర్ . నారాయణమూర్తి ని పోడిచాదట . నారాయణమూర్తి కడుపులో ,కాలు పై కత్తి పోట్లు పడ్డాయని అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారని తెలిసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com