కేరళ తర్వాత ఆ సర్వీస్ విజయవాడ లోనే!
- January 06, 2022
విజయవాడ: ఒమిక్రాన్ కేసుల నిర్ధారణ ఇక విజయవాడలోనే జరుగనుంది. విజయవాడలోని సిద్ధార్ధ మెడికల్ కాలేజ్‌లో సంపూర్ణ సీక్వెన్సింగ్ ల్యాబ్ ఏర్పాటు చేశారు.
కేసులు పెరుగుతుండడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ స్థానికంగా అందుబాటులోకి రావడంతో.. వేరియంట్‌ను వేగంగా నిర్ధారించే అవకాశం ఉంది. జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లు దేశంలో కొన్ని ఉన్నప్పటికీ.. ఇలా సంపూర్ణంగా సీక్వెన్సింగ్ చేసే ల్యాబ్ ఇది రెండోదే. మొదటిది కేరళలో ఏర్పాటు చేయగా రెండోది విజయవాడకు కేటాయించారు. ఒమిక్రాన్‌తో పాటు ఇతర వేరియంట్లను ఈ ల్యాబ్‌లో నిర్ధారించవచ్చు.
మూడురోజుల్లో వేరియంట్ నిర్ధారణ జరుగుతుంది. ఇప్పటిదాకా శాంపిళ్లను హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. ఇప్పుడిక స్థానికంగానే నిర్ధారించే అవకాశముంటుంది. దీనివల్ల రోగులను త్వరగా గుర్తించి ఐసొలేట్ చేయడం, చికిత్స అందించడానికి వీలవుతుంది. వేరియంట్ వ్యాప్తి నియంత్రించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోనే ఈ ల్యాబ్ పని చేయనుంది. ఈ ల్యాబ్‌కు హైదరాబాద్‌కు చెందిన CCMB, CSIR సహకారమందిస్తున్నాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..