మేజర్ నుండి రొమాంటిక్ సాంగ్ విడుదల
- January 07, 2022హైదరాబాద్: ‘క్షణం’,‘అమీ తుమీ’, ‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి వినూత్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలతో ఆకట్టుకున్న అడవి శేష్.. ప్రస్తుతం మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న మేజర్ సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థతో కలిసి మహేష్ బాబు నిర్మిస్తుండగా.. ‘గూఢచారి’ దర్శకుడు శశి కిరణ్ తిక్క డైరెక్ట్ చేస్తున్నాడు. తెలుగుతో పాటుగా హిందీ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుండి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలైంది.
“హృదయమా” అనే సాంగ్ ను ఈరోజు మహేష్ బాబు చేతుల మీదుగా లాంచ్ చేశారు.మోస్ట్ హ్యాపెనింగ్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ శ్రావ్యమైన సాంగ్ చాలా రొమాంటిక్ గా, ఉల్లాసంగా ఉంది. లిరికల్ వీడియో సినిమాలోని ప్రేమికుల మధ్య సుదూర సంబంధాన్ని సూచిస్తోంది.ఈ పాట చాలా ఆకర్షణీయంగా ఉంది.రొమాంటిక్ సాంగ్స్ ఇష్టపడే వారి ప్లేలిస్ట్ లో ఈ సాంగ్ టాప్ లో ఉంటుంది.ఈ రొమాంటిక్ సాంగ్ కు కృష్ణ కాంత్, విఎన్వి రమేష్ కుమార్ లిరిక్స్ అందించారు.శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..