బహ్రెయిన్-భారత్ దౌత్య సంబంధాలను పరిచయం చేసే డాక్యూమెంటరీ విడుదల
- January 07, 2022
మనామా: బహ్రెయిన్ మరియు భారతదేశం దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ అంశాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ తీయడం జరిగింది.బహ్రెయిన్ లోని నవభారత్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమంలో ఈ డాక్యూమెంటరీని విడుదల చేయడం జరిగింది.
ట్రేడ్, కామర్స్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, నిర్మాణ మరియు పర్యాటక రంగం వంటి వివిధ రంగాలలో 50 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన అభివృద్ధి అంశాలపై ఈ డాక్యుమెంటరీ తీయడం జరిగింది.
'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహ్రెయిన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాత్సవ విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, బహ్రెయిన్ లోని పలు కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. "ఇరు దేశాల సంస్కృతీ, వ్యాపార రంగాల అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా తీసిన ఈ డాక్యుమెంటరీ వచ్చే తరాలకు కూడా దిక్సూచిగా ఉంటుంది" అని భారత రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు. నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి మాట్లాడుతూ "మేము చేసిన ఈ చిరు ప్రయత్నం బహ్రెయిన్ లోని ప్రవాసీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తీసినది. ఈ కార్యక్రమంలో మాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు" అని అన్నారు.
నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి