బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు..
- January 08, 2022
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేష్ విడుదలైంది.. మొత్తం 25 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్లో అప్లే చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 7ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు.
గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కనీసం మూడు నెలల సర్టిఫికేషన్ కోర్సు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు. కనీసం ఐదేళ్ల పాటు ఆర్మీ/నేవీ/ఎయిర్‌ఫోర్స్‌లో పని చేసి ఉండాలి. ఈ ఉద్యోగాలు వయోపరిమితిగా 40 ఏళ్లను నిర్ణయించారు. అభ్యర్ధులు నవంబర్ 1 నాటికి 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య తప్పనిసరిగా ఉండాలి.
అభ్యర్థుల ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అప్లై చేసే విధానం.. 1. అభ్యర్ధులు మొదట బ్యాంక్ అధికారిక వెబ్సైట్ https://bankofindia.co.in/ను ఓపెన్ చేయాలి. 2. అనంతరం కెరీర్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. Recruitment of Specialist Security Officers అనే లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి. 4. తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో click for apply online అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!