తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- January 08, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలను గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2వేల మార్కును దాటేశాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,606 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో రోజు. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వివరాల ప్రకారం 24 గంటల్లో 285 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ సంఖ్య 6,92,357కు పెరిగింది. ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్ కారణంగా మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.65 శాతంగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 12,180 యాక్టివ్ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 73,156 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 1,583 కేసులు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 214 కేసులు, మేడ్చల్‌లో మరో 292 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







