తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

- January 08, 2022 , by Maagulf
తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులు భయాందోళనలను గురి చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2వేల మార్కును దాటేశాయి. ఇక తాజాగా గడిచిన 24 గంటల్లో ఏకంగా 2,606 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వరుసగా రెండు వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇది రెండో రోజు. వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో వివరాల ప్రకారం 24 గంటల్లో 285 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ సంఖ్య 6,92,357కు పెరిగింది. ఇందులో 6,76,136 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ కారణంగా మొత్తం 4,041 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మరణాల రేటు 0.58శాతంగా ఉందని, రికవరీ రేటు 97.65 శాతంగా అధికారులు తెలిపారు. ప్రస్తుతం 12,180 యాక్టివ్‌ కేసులున్నాయని, ఇవాళ ఒకే రోజు 73,156 టెస్టులు నిర్వహించినట్లు వివరించింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,583 కేసులు రికార్డయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 214 కేసులు, మేడ్చల్‌లో మరో 292 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com