తెలంగాణలో రేపటి నుంచి ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వ్యాక్సిన్..
- January 09, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో విజృంభిస్తోన్న ఒమిక్రాన్.. మరోవైపు కుప్పలు తెప్పలుగా నమోదవుతోన్న కోవిడ్ కేసులు. దీంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపటి (జనవరి10) నుంచి ఉచితంగా ప్రికాషన్ డోసులు అందించేందుకు సిద్ధమైంది.తెలంగాణలోనూ ఈ వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్ధమైంది. ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు రేపటి నుంచి ఉచితంగా ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. వీరితో పాటు 60 ఏళ్ల పైబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ బూస్టర్ షాట్ ఇవ్వనున్నారు.
రిజిస్ట్రేషన్ ఎలాగంటే...
ఇప్పటికే కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారు ప్రికాషన్ డోస్ కోసం మళ్లీ కొవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవచ్చు. ప్రికాషనరీ డోస్ వ్యాక్సిన్ షెడ్యూల్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. నిన్నటి నుంచే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.అలాగే రేపటి(జనవరి 10) నుంచి నేరుగా వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి కూడా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు.
అర్హులు ఎవరంటే...
ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ కార్మికులు, 60 ఏళ్లు పైబడి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు ప్రికాషనరీ డోసు తీసుకునేందుకు అర్హులు.
నో మిక్సింగ్. వీరితో పాటు 60 ఏళ్లు పైబడి..గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, స్టెమ్ సెల్ మార్పిడి, సిర్రోసిస్, క్యాన్సర్ తదితర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోస్ తీసుకోవచ్చు.
నో మిక్సింగ్...
కాగా ఇప్పటికే కొవిడ్-19 రెండు డోసులకు సంబంధించి ఏ వ్యాక్సిన్ తీసుకున్నారో ప్రికాషన్ డోసు కూడా అదే కంపెనీకి సంబంధించిన వ్యాక్సిన్ ఇస్తారు.ప్రికాషన్ డోసులో వ్యాక్సిన్‌ల మిక్సింగ్ ఉండదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది.ఉదాహరణకు ఇప్పటికే రెండు డోస్‌ల కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకుని ఉంటే.. ప్రికాషన్ డోసు కూడా కోవిషీల్డ్‌నే అందిస్తారు.ఒకవేళ కోవాగ్జిన్ తీసుకుని ఉంటే అదే ఇస్తారు. అయితే రెండో డోసు పూర్తయి తొమ్మిది నెలలు గడిచిన వారు మాత్రమే ఈ బూస్టర్ షాట్ తీసుకోవాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్‌తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్‌లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







