షార్జా వెళ్లే విమానప్రయాణికులకు శుభవార్త!
- January 10, 2022
న్యూఢిల్లీ: భారతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్ స్పైస్‌జెట్ షార్జా వెళ్లేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌లోని మూడు నగరాల నుంచి షార్జాలకు విమాన సర్వీసులు ప్రారంభించింది. జనవరి 7 నుంచి పుణే, మదురై, మంగళూరు నుంచి షార్జాకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.ఇక ఈ మూడు నగరాల నుంచి షార్జాకు వెళ్లే విమాన సర్వీసుల షెడ్యూల్ వివరాలను పరిశీలిస్తే..
- పుణే టు షార్జా: డైలీ రాత్రి 9.05 గంటలకు విమానం బయల్దేరుతుంది. షార్జా విమానాశ్రయానికి రాత్రి 11.10 గంటలకు చేరుకుంటుంది.
- మదురై టు షార్జా: వీక్లీ నాలుగు సర్వీసులు మాత్రమే. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు మధ్యాహ్నం 3.30 గంటలకు చేరుతుంది.
- మంగళూరు టు షార్జా: వారంలో నాలుగు సర్వీసులు. సోమ, మంగళ, గురు, శనివారాల్లో మదురై నుంచి రాత్రి 10.30 గంటలకు బయల్దేరే విమానం షార్జాకు తెల్లవారుజామున 12.55 గంటలకు చేరుకుంటుంది. ఇలా స్పైస్‌జెట్ ఈ మూడు నగరాల నుంచి వారానికి మొత్తం 15 విమాన సర్వీసులు నడపనుంది.ఇక పుణే విమానాశ్రయం నుంచి దాదాపు రెండేళ్ల తర్వాత తొలి అంతర్జాతీయ విమానం జనవరి 7న వెళ్లింది.
తాజా వార్తలు
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత
- ప్రయాణికులకు వీసీ సజ్జనార్ కీలక సూచన..
- భారత్–అమెరికా వాణిజ్య చర్చలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
- స్థానిక ఎన్నికలు.. జగన్ కీలక నిర్ణయం, అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్!
- అబుధాబిలో నవంబర్ 28 నుంచి మదర్ ఆఫ్ ది నేషన్ ఫెస్టివల్..
- ఘోర పడవ ప్రమాదం..14 మంది మృతి..
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!







