ఆ చిన్న తప్పు కారణంగా 50 ఏళ్లుగా ఇక్కడి భూమి మండుతూనే ఉంది..
- January 10, 2022
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 ఏళ్ల నుంచి ఇక్కడ ఏర్పడిన బిలం మండుతూనే ఉంది. అప్పట్లో చేసిన చిన్న తప్పిదం వల్ల ఏళ్ల తరబడి అక్కడి వాతావరణ పరిస్థితులు ప్రమాదకరంగా మారుతూ వస్తున్నాయి.
ఆ మంటల వల్ల పర్యవరణానికి మాత్రమే కాదు.. స్థానిక ప్రజలు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరి, ఆ మంటకు కారణం ఏమిటీ? అది ఎందుకు ఏర్పడిందో తెలియాలంటే.. 1971లో ఏం జరిగిందో తెలుసుకోవాలి.
తుర్క్మెనిస్తాన్ ఓ భారీ అగ్నిబిలం ఉంది. దీన్ని అంతా నరక ద్వారం(Gateway To Hell) అంటారు. అయితే, అగ్నిపర్వతాలకు, ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది. అగ్నిపర్వాతాల్లో లావా ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది. అవి ఎప్పుడు పేలుతాయో చెప్పడం కష్టం. అయితే, ఈ బిలం అలాంటిది కాదు. ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఓ భయానక ఘటన.
ఈ నరక ద్వారం గురించి తెలుసుకొనే ముందు మనం 1995, జనవరి 8న తూర్పు గోదావరి జిల్లా పాశర్లపూడి గ్రామంలో చోటుచేసుకున్న ఘటన గురించి తెలుసుకోవాలి. చమురు అన్వేషణలో భాగంగా ONGC డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీకైంది. ఆ వెంటనే నిప్పు అంటుకుంది. సుమారు 65 రోజులపాటు అది మండుతూనే ఉంది. ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు. దాదాపు అలాంటి ఘటనే అష్గాబాత్‌కు 260 కిమీల దూరంలో చోటుచేసుకుంది.
1971లో సోవియెట్ జియోలజిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా వారు అక్కడ భారీ గ్యాస్ లీకైంది. ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది. దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియోలజిస్టులు.. గ్యాస్‌ను మండించారు. కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు. అయితే, 50 ఏళ్లు గడిచినా.. ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది.

'దర్వాజా క్రేటర్' అని పిలిచే ఈ ప్రాంతం క్రమేనా పర్యాటక స్థలిగా మారింది. చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోలు దిగుతుంటారు. అయితే.. భవిష్యత్తులో మీరు ఈ నరక ద్వారాన్ని చూసే అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే.. తుర్క్మెనిస్తాన్ ప్రభుత్వం ఈ బిలాన్ని మూసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. నిత్యం గ్యాస్ మండటం వల్ల పర్యవరణానికి, ప్రజలకు హాని జరుగుతోందని.. ఈ బిలాన్ని మూసివేయడానికి ఉన్న మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు. అయితే, 2010లోనే ఇక్కడి మంటలు ఆర్పడానికి ప్రయత్నాలు జరిగాయి. కానీ సాధ్యం కాలేదు. మరి ఈ సారైనా సక్సెస్ సాధిస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







