ఒమిక్రాన్ పంజా: పండుగ వేళ కావున ఆంక్షలు కఠినతరం చేసిన తెలంగాణ
- January 10, 2022
హైదరాబాద్: భారత్ లో కోవిడ్ విజృంభిస్తోంది. కోవిడ్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కోవిడ్ ఆంక్షల గడువును జనవరి 20 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు జీవో నెం 6 తీసుకువచ్చింది, తెలంగాణలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ కోవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆంక్షలు కఠినతరం చేసింది. రాష్ట్రంలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ నిర్వహించకూడదు. అలాగే ప్రజలు గుంపులుగా చేరకూడదు. బహిరంగ ప్రదేశాల్లో షాపింగ్ మాల్స్, ప్రజా రవాణా , వ్యాపార సంస్థల్లో ప్రతి ఒక్కరు తప్పని సరి మాస్కు ధరించాలి. ఈమేరకు ఆదివారం తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కు ధరించకుంటే రూ.1000 జరిమానా విధిస్తారు. అలాగే మతపర, సాంస్కృతిక, రాజకీయ కార్యక్రమాల నిర్వహణపై సర్కార్ నిషేధం విధించింది.
ఈ నేపథ్యంలో ప్రత్యక్ష తరగతుల చదువుల సంబరం ఎంతో కాలం నిలిచేలా లేదు. థర్డ్ వేవ్ ఎంట్రీ ఇచ్చిందంటూ వైద్య శాఖ చెబుతుండటంతో ముందుగానే విద్యాలయాలకు సంక్రాంతి సెలవులతో సర్దేసింది సర్కారు. ఇంతవరకు బానే ఉన్నా ఈ నెల 16తో సంక్రాంతి హాలీడేస్ ముగుస్తాయి. ఆ తర్వాత పరిస్థితే గందరగోళంగా మారింది. రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా మళ్లీ బడులు తెరుచుకునే పరిస్థితి ఉందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. ఈ నెలాఖరులో థర్డ్ వేవ్ పీక్ స్టేజ్ కు వెళ్తుందని హెల్త్ డిపార్ట్ మెంట్ చెబుతుంటే.. స్కూళ్లు ఓపెన్ చేసే పరిస్థితే ఉండదని నిపుణులు చెబుతున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల11 నుంచి బడులకు, 13 నుంచి కాలేజీలకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా… 8 నుంచే విద్యాసంస్థలకు సర్కార్ సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
సెలవుల తర్వాత ఫిజికల్ క్లాసులకు సర్కార్ అనుమతిచ్చేది డౌటేనని ఆఫీసర్లే చెబుతున్నారు. దీంతో విద్యాసంవత్సరం వేస్ట్ కాకుండా స్టూడెంట్లకు పాఠాలు చెప్పేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. మళ్లీ ఆన్లైన్, టీవీ పాఠాలను స్టూడెంట్లకు అందించేందుకు చర్యలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో 2020-21అకాడమిక్ ఇయర్ లో కేవలం నెల రోజులే ఫిజికల్ క్లాసులు నడవగా, మిగిలిన క్లాసులన్నీ ఆన్లైన్లోనే జరిగాయి. దీంతో విద్యావ్యవస్థ గాడీ తప్పింది. 2021-22 అకడమిక్ ఇయర్ లో జులైలో ఆన్లైన్, టీవీ పాఠాలు మొదలు కాగా కేసులు తగ్గడంతో సెప్టెంబర్ నుంచి ఫిజికల్ క్లాసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడిప్పుడే విద్యావ్యవస్థ గాడిన పడుతుందనే టైమ్ లో మళ్లీ కేసులు ఎక్కువయ్యాయి. దీంతో మళ్లీ బడులు బంద్ అయ్యే పరిస్థితి రావడంతో స్టూడెంట్లు, పేరెంట్స్‌లో అయోమయం నెలకొంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!







