‘విక్రమ్ వేద’ ఫస్ట్ లుక్ విడుదల
- January 10, 2022
ముంబై: గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ నెక్స్ట్ మూవీ ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ పై ఇప్పుడు ఆయన అభిమానుల దృష్టి ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ కాస్ట్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఈ మూవీ అప్డేట్స్ కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిన్న సాయంత్రం మేకర్స్ హృతిక్ పుట్టిన రోజున ఈ చిత్రంలో వేదగా ఆయన పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా ‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్ నుంచి హృతిక్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ లో హృతిక్ రోషన్ డాషింగ్‌గా కనిపిస్తున్నాడు. ఆయన రఫ్ అండ్ టఫ్ లుక్ అట్ట్రాక్టీవ్ గా ఉంది. గడ్డంతో కన్పిస్తున్న వేద నల్ల కళ్లద్దాలతో, నల్లటి కుర్తాలో రక్తంతో తడిసిన అతడిని చూస్తుంటే ఒరిజినల్ లాగానే ఈ యాక్షన్ మూవీ కూడా చూడొచ్చని అనిపిస్తోంది. ‘విక్రమ్ వేద’ ఒరిజినల్ వెర్షన్లో వేద పాత్రను విజయ్ సేతుపతి పోషించారు. హృతిక్ లుక్ అతనిని గుర్తుకు తెచ్చింది. కానీ హృతిక్ ఈ లుక్‌లో తనదైన స్టైల్ లో భిన్నంగా, ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు.
ఈ చిత్రం తమిళంలో ఘనవిజయం సాధించిన ‘విక్రమ్ వేద’ చిత్రానికి హిందీ రీమేక్. ఒరిజినల్లో విక్రమ్ పాత్రలో ఆర్ మాధవన్, వేద పాత్రలో విజయ్ సేతుపతి కనిపించారు. ఒరిజినల్‌ను రూపొందించిన దర్శకుడు పుష్కర్ గాయత్రి ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. సైఫ్ ఫస్ట్ లుక్ ఇంకా రాలేదు. ఇందులో రాధికా ఆప్టే కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ రోజు హృతిక్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు ట్రీట్ గా వేదను పరిచయం చేశారు మేకర్స్.
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్‌తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్‌పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’