బ్యాంక్ ఖాతాదారులకు అలెర్ట్..
- January 10, 2022
తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకొనే సంక్రాంతి పండగతో పాటు వివిధ రాష్ట్రాల్లో నిర్వహించుకునే పర్వదినాల సందర్భంగా జనవరి 11 నుంచి 5 రోజుల పాటు బ్యాంకులు మూత పడనున్నాయి.ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే బ్యాంక్ సెలవులు జాబితాను వెబ్ సైట్ లో ప్రకటించింది.ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారం జనవరి నెలలో 16 రోజుల వరకు సెలవులు ఉన్నాయి. వీటిల్లో ఇప్పటికే కొన్ని హాలిడేస్ అయిపోయాయి.ఈ క్రమంలోనే దేశంలోని పలు రాష్ట్రాల్లో జరుపుకొనే వివిధ పండగల కారణంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు బ్యాంకులు బంద్ కానున్నాయి. అయితే రాష్ట్రాల వారీగా బ్యాంకుల సెలవులు మారుతాయి.కాబట్టి తప్పనిసరిగా బ్యాంక్ కు వెళ్లాలని భావించే వారు బ్యాంక్ హాలిడేస్ తెలుసుకోవాలి.మరి ఆర్‌బీఐ ప్రకటించిన క్యాలెండర్ ప్రకారం ఈ వారలో ఎప్పుడెప్పుడు బ్యాంకులు పనిచేయవో తెలుసుకుందాం.
- జనవరి 11 – మిషనరీ డే – ఐజ్వాల్ (మిజోరాం)
- జనవరి 12 – స్వామి వివేకానంద జయంతి – కోల్‌కతా(పశ్చిమ బెంగాల్)
- జనవరి 14 – మకర సంక్రాంతి/ పొంగల్ -( అహ్మదాబాద్, చెన్నై)
- జనవరి 15 – సంక్రాంతి / సంక్రాంతి మాఘే / తిరువల్లువార్ డే – (ఏపీ,తెలంగాణ రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల్లో)
- జనవరి 16- ఆదివారం
అయితే బ్యాంక్ సెలవులు ఉన్నా కూడా కస్టమర్లు ఆన్‌లైన్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా బ్యాంక్ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..