ఇండియన్ వర్కర్స్‌కి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు
- March 26, 2016
బహ్రెయిన్‌లోని ఇండియన్ లేడీస్ అసోసియేషన్ (ఐఎల్‌ఎ) డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్‌లో భాగంగా 'లెర్న్ ఇంగ్లీష్' అనే కార్యక్రమాన్ని భారతీయ వలస కార్మికుల కోసం ప్రారంభించనుంది. ఏప్రిల్‌లో ప్రారంభం కానున్న ఈ క్లాసులు రెండు నెలలపాటు సాగుతాయి. వారానికి రెండు సెషన్స్ వుంటాయి. స్పోకెన్ ఇంగ్లీష్‌కి సంబంధించిన పాఠాలు ఇందులో చెబుతారు. అలాగే పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పైనా క్లాసులు నిర్వహిస్తారు. గడచిన 15 ఏళ్ళుగా ఈ కార్యక్రమానికి వస్తున్న రెస్పాన్స్‌తో ప్రతియేడూ ఇంకా మెరుగైన రీతిలో ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ పిల్లలకు సంబంధించి స్కూల్ యాజమాన్యాలతో మాట్లాడేందుకు మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారనీ, వారికి ఈ కోర్స్ బాగా ఉపయోగపడ్తుందనీ, అలాగే వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకూ స్పోకెన్ ఇంగ్లీష్ అత్యవసరమన్నారు నిర్వాహకులు. ఆసక్తి ఉన్నవారు 17 740431 నెంబర్‌కు తమ అప్లికేషన్‌ని ఫ్యాక్స్ చేయవచ్చు. కంపెనీలు కూడా తమ కార్మికులకు స్పోకెన్ ఇంగ్లీషు క్లాసులు ఇప్పించాలంటే కోఆర్డినేటర్స్‌ని సంప్రదించవచ్చనీ, 39072883 నంబర్‌లో జనరల్ సెక్రెటరీని సంప్రదించవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







