అపహరించి....ఆపై వారికే బేరం పెట్ట్జిన ఘరానా రూంమేట్
- March 26, 2016
బంగ్లాదేశ్ కు చెందిన ఒక వ్యక్తికి దోహా నేర న్యాయస్థానం ఒక సంవత్సరం కారాగారం విధించినట్లు స్థానిక అరబిక్ డైలీ ఆర్రయహ్ శుక్రవారం నివేదించారు. ఈ బంగ్లాదేశ్ నిందితుడు తన రూంమేట్ల వద్ద దొంగతనానికి పాల్పడ్డాడు.వారి వద్ద నుంచి 3,700 ఖతర్ రియాళ్ళను, వారి మొబైల్ ఫోన్లను, తన సహచరుల యొక్క పాస్ పోర్టులను సైతం దోచుకున్నాడు.ఆ తర్వాత కొల్లగొట్టిన ధనంతో బంగ్లాదేశ్ కు వెళ్ళాడు. పోలిసుల పరిశోధన ప్రకారం నిందితుడు దేశం విడిచి వెళ్లేముందు తన రూంమేట్ల కలసి తాను త్వరగా తన దేశం వెళ్ళాలని రూం తాళం చెవి ఇవ్వాలని కోరాడు. దీంతో వారు దొంగ చేతికి తాళం చెవిని ఇచ్చారు.తర్వాత ఆ ఘరానా రూంమేట్ 3,700 ఖతర్ రియాళ్ళను, వారి మొబైల్ ఫోన్లను, తన సహచరుల యొక్క పాస్ పోర్టులను దొంగిలించి కతర్ విడిచి తన దేశానికి చక్కా వెళ్ళిపోయాడు.కొన్నాళ్ళ తర్వాత బంగ్లాదేశ నుంచి తన మాజీ రూంమేట్లకు ఫోన్ చేసి " మీ పాస్ పోర్టులు మీకు తిరిగి కావాలంటే....నాకు ఒకక్కరు 1,500 ఖతర్ రియాళ్ళను తన ఎకౌంటుకు పంపాలని " బేరం పెట్టాడు. దీనికి నిరాకరించిన వారు లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో కొంతకాలానికి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మరో వ్యక్తి ద్వారా దోచుకొన్న పాస్ పోర్ట్లను వారి యజమానులకు అప్పగించాడు. దోహా పోలీసులు బంగ్లాదేశ్ పోలీసులని సంప్రదించి ఘరానా రూంమేట్ సంబంధించిన సమాచారం అందించారు దీంతో చేసిదేమి లేక వారి వారి పాస్ పోర్టులు తిరిగి బంగ్లాదేశ్ పోలీసు స్టేషన్ వద్ద అప్పగించాడు. కాగా పోలీసులు దోహ శిక్ష అమలుపరచేందుకు ఖతర్ ఆ నిందితుడ్ని తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







