రెస్టారెంట్ల కోసం కొత్త ప్రోటోకాల్స్

- January 11, 2022 , by Maagulf
రెస్టారెంట్ల కోసం కొత్త ప్రోటోకాల్స్

సౌదీ అరేబియా: రెస్టారెంట్ల, కేఫ్ ల కోసం కొత్త ప్రోటోకాల్స్ ను అప్డేట్ చేశారు. సోషల్ డిస్టెన్స్ నిబంధనల మేరకు రెస్టారెంట్ల కోసం కొత్త ప్రోటోకాల్స్ ను మునిసిపల్, గ్రామీణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అండ్ గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ రూపొందించాయి. రెస్టారెంట్లు, కేఫ్‌ల కోసం అప్‌డేట్ చేసిన హెల్త్ ప్రోటోకాల్‌ను పబ్లిక్ హెల్త్ అథారిటీ (వెఖాయా) జారీ చేసింది. కొత్త ప్రోటోకాల్స్ ప్రకారం, ఒక టేబుల్ వద్ద ఎక్కువ మంది భోజనం చేయడాన్ని రద్దు చేశారు. రెండు టేబుల్స్ మధ్య దూరం కనీసం మూడు మీటర్లు ఉండాలి. రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లోకి ప్రవేశం తవక్కల్నా అప్లికేషన్‌లో టీకా షెడ్యూల్‌ను పూర్తి చేసిన వారికి మాత్రమే పరిమితం చేశారు. వైద్య కారణాలతో వ్యాక్సిన్ తీసుకోకుండా మినహాయించబడిన వారికి మినహాయింపు ఇచ్చారు. రెస్టారెంట్‌లు, కేఫ్‌లలోకి ప్రవేశించే ముందు కస్టమర్ల ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు ఆటోమేటెడ్ వెరిఫికేషన్ కోసం QR కోడ్‌ని స్కాన్ చేయనున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com