ఐటీ రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
- January 11, 2022
న్యూ ఢిల్లీ: పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తను అందించింది. తాజాగా ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును కేంద్రం పొడిగించింది. ఈ గడువును మార్చి 15 వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ గడువు డిసెంబర్ 31 వరకు ఉంది. కాగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఐటీ రిటర్న్స్ దాఖలు గడువును పొడిగించినట్లు కేంద్రం తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల మేరకు 2022 మార్చి 15 వరకు 2021-22 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవచ్చు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే గడువు నిజానికి 2021 డిసెంబర్ 31నే ముగిసింది.అయితే ఈసారి గడువు పెంచేది లేదని చివరిరోజు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా. కానీ అనూహ్యంగా గడువు ముగిసిన 10 రోజుల తర్వాత ఐటీ రిటర్న్స్ గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
తాజా వార్తలు
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్‌కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?









