అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పై ఈ సమయాల్లో సాలిక్ ఉండదు

- January 12, 2022 , by Maagulf
అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పై ఈ సమయాల్లో సాలిక్ ఉండదు

యూఏఈ: వీక్ డేస్ రాత్రి సమయంలో, ఆదివారం రోజంతా అల్ మక్తూమ్ బ్రిడ్జ్ పై వెళ్లే వాహనాలకు సాలిక్ వర్తించదని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) తెలిపింది. జనవరి 15 నుండి, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మూసివేసే సమయాలు ఇలా ఉండనున్నాయి.

వీక్ డేస్: సోమవారం నుండి శుక్రవారం వరకు, రాత్రి 10 నుండి ఉదయం 6 వరకు.
వీకెండ్స్: శనివారం రాత్రి 10 గంటల నుండి సోమవారం ఉదయం 6 గంటల వరకు.
సవరించిన సమయాలు UAE కొత్త వర్క్‌వీక్‌ కు అనుగుణంగా ఉన్నాయి. దేశంలో శుక్రవారం సగందినం, శనివారం, ఆదివారం సెలవు దినాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే.

సాలిక్ అనేది దుబాయ్ యొక్క ఆటోమేటిక్ రోడ్ టోల్ కలెక్షన్ సిస్టమ్. వాహనం సాలిక్ పాయింట్ గుండా వెళ్ళిన ప్రతిసారీ, ప్రీపెయిడ్ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా Dh4 టాక్స్ కట్ అవుతుంది. అల్ మక్తూమ్ వంతెన (ఉమ్ హురైర్ రోడ్) దుబాయ్‌లోని ఏడు టోల్ గేట్లలో ఒకటి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com